పెళ్లైన నెలరోజులకే గర్భమా? దియా మీర్జా ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్‌పై ట్రోల్స్..

by Shyam |
Dia Mirza
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ దియా మీర్జా ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్‌తో విమర్శల పాలైంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్‌లో పెళ్లి చేసుకున్న తను నెలరోజుల్లోనే ప్రెగ్నెన్సీ అని ప్రకటించడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది. స్టీరియోటైప్స్ బ్రేక్ చేస్తూ తన వివాహం జరిపించేందుకు మహిళా పూజారిని ఎన్నుకున్న దియా మీర్జా.. పెళ్లికి ముందే తన ప్రెగ్నెన్సీ గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. కాగా దీనిపై స్పందించిన దియా.. ‘ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పెళ్లికి ప్లాన్ చేస్తున్నప్పుడే బిడ్డను పొందబోతున్నామని తెలుసుకున్నాం. కాబట్టి ఈ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ రిజల్ట్ కాదు. మెడికల్ రీజన్స్ వల్లే ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించలేకపోయాం. ఇది నా జీవితంలో చాలా సంతోషకరమైన వార్త. ఈ మూమెంట్ కోసం కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నా. బేబీని పొందడం నా లైఫ్‌లో ఒక అందమైన బహుమతి. ఈ బ్యూటిఫుల్ జర్నీ గురించి చెప్పేందుకు ఎప్పటికీ సిగ్గుపడను’ అని సమాధానం ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed