- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Social Media : రేపటి నుండి సోషల్ మీడియా యాప్స్ బ్లాక్.. మేము ఏమైపోవాలంటున్న మీమర్స్
దిశ, వెబ్‌డెస్క్: మే 26నుండి ఇండియాలో ఫేస్‌బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter) బ్యాన్ చేస్తున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇండియాలో ఈ మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం తప్పేలా లేదన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 25న కొత్త ఐటీ రెగ్యులేషన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిని అమలు చేయడానికి మూడు నెలలు వ్యవధి కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నేటితో ఆ గడువు ముగియనుండటంతో ఫేస్‌బుక్, ట్విట్టర్, యాప్స్ ని నిషేధిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ వార్తలపై నెట్టింట మీమ్స్ వైరల్ గా మారాయి. మీమ్స్ పేజెస్ ఎక్కువగా వాడే ఈ యాప్స్ నిషేధిస్తే తమ పరిస్థితి ఏంటని.. ఫన్నీగా మీమ్స్ రూపంలో తెలుపుతున్నారు మీమ్స్ క్రియేటర్లు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫన్నీ మీమ్స్ యే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ట్విట్టర్ లో ట్రెండింగ్ గా కూడా ఈ వార్త నిలవడం విశేషం.
ప్రస్తుతం యువత ఇంట్లో కన్నా ఫోన్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఫేస్‌బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter) ,ఇన్‌స్టాగ్రామ్ (Instagram) అంటూ వాటిల్లోనే తమ ఆనందాన్ని వెతుకుంటున్నారు. ఇక లాక్ డౌన్ సమయం కావడంతో ఎక్కువమంది ఈ సోషల్ మీడియా యాప్స్కే పరిమితమైపోయారు. మరి ఇలాంటి సమయంలో ఈ యాప్స్ బ్యాన్ చేయడం వారికి పెద్ద సమస్యే అని చెప్పాలి. మరి ఈ విషయమై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఫన్నీ మీమ్స్ పై ఓ లుక్ వేసి హాయిగా నవ్వుకోండి.