- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వైరస్ మీటరా? ఎనిమిది మీటర్లా? ఎంత దూరం ప్రయాణిస్తుంది?
కరోనా వైరస్ సోకిన వారు తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడతారన్న సంగతి తెలిసిందే. వారు దగ్గినా, తుమ్మినా, ఆఖరికి ఊపిరి గట్టిగా వదిలినా, ఈ వైరస్ గాల్లోంచి ఇతరులకు వ్యాపిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ ఎంత దూరం వరకు ప్రయాణిస్తుంది? ఇంతవరకూ ఈ వైరస్ కేవలం ఒక మీటరు దూరం వరకు మాత్రమే ప్రయాణించగలదని, తరువాత కింద పడిపోతుందన్న వివరాలు వెల్లడయ్యాయి. అవన్నీ వాస్తవాలు కాదని ఇప్పుడు మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడవ్వడంతో కరోనా భయం మరింత పెరిగిపోతోంది.
సామాజిక దూరం పేరిట మనిషికి, మనిషికి మధ్య కనీస భౌతిక దూరం ఒక మీటరు (మూడు అడుగులు) ఉండేలా చూసుకోవాల్సి వుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ సామాజి దూరం పాటించాలని, మనిషికి మనిషికి మధ్య మీటర్ దూరం ఉండాలని సూచించాయి. అయితే మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు జరిపిన తాజా పరిశోధనలో ఈ వైరస్ ఎనిమిది మీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదని తేలింది.
ఈ పరిశోధన ప్రకారం, ఈ వైరస్ గాల్లో నాలుగు గంటల పాటు జీవించే ఉంటుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గతంలో చేసిన మీటరు దూరం సూచనలు ఎంతవరకూ పనిచేస్తాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. కాగా, మసాచుసెట్స్ శాస్త్రవేత్తల పరిశోధనా వివరాలు ‘జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్’ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
కాగా, 1930లో తుమ్ము, దగ్గు వంటి వాటివల్ల బయటకు వచ్చే క్రిములపై జరిపిన పరిశోధనల తరువాత డబ్ల్యూహెచ్ఓ, ఆ భౌతిక దూరాన్ని ప్రతిపాదించిందని, ఇప్పుడు వైరస్ లు బలపడటంతో, ఆ దూరం సరిపోదని పరిశోధనల్లో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ లిడియా బౌరౌబా తెలియజేశారు. నోరు, ముక్కు నుంచి బయటకు వచ్చే నీటి తుంపరలు వైరస్ ను కలుపుకుని 23 నుంచి 27 అడుగుల దూరం వరకూ ప్రయాణిస్తాయని తమ పరిశోధనల్లో తేలిందని ఆయన అన్నారు. ప్రజలు ఇతరులతో సాధ్యమైనంత ఎక్కువ దూరాన్ని పాటిస్తేనే వైరస్ బారిన పడకుండా తప్పించుకునే అవకాశాలు అధికమని స్పష్టం చేశారు.
Tags : corona virus, covid-19, social distance, journal of american medical association, massachusetts university