షూలో దూరి మరీ ఎస్పీని కాటేసిన పాము

by Shamantha N |
షూలో దూరి మరీ ఎస్పీని కాటేసిన పాము
X

దిశ, వెబ్‌డెస్క్ :

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా ఎస్పీని పాము కాటేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లా ఎస్పీ బూట్లు తొడుక్కుంటున్న సమయంలో కాలికి ఎదో తాకినట్టు అనిపించడంతో.. బూట్లను పరిశీలించగా అందులో పాము ప్రత్యక్షమైంది. ఈలోపే పాము కాటు వేయనే వేసింది. దీంతో అక్కడే ఉన్న సిబ్బంది ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే, సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, షూలోనే ఉన్న పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story