- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్‌లో శబ్దాలు చేస్తున్న వింత పాము
దిశ ప్రతినిధి, కరీంనగర్ : పాములు సాధారణంగా బుస కొడతాయన్నది అందరికీ తెలిసిందే. కానీ, ఇక్కడ మాత్రం ఓ పాము వెరైటీ శబ్దాలతో స్థానికులను పరేషాన్ చేస్తోంది. చూడడానికి పాములా ఉన్న నోరు మాత్రం పెద్దదిగా తెరుస్తుండటం స్థానికులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల ఇందిరమ్మ కాలనీలో కనిపించిన ఈ వింత పాము వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాలనీలోని నీలగిరి చెట్లల్లో కనిపించిన ఈ పాము వింతగా శబ్దం చేస్తుండటం విడ్డూరంగా ఉందని అందరూ అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సర్పం చిన్నదిగా ఉండి పెద్దగా నోరు తెరచి అరుస్తుండటంతో ఇలాంటిది ఇదివరకు ఎన్నడూ చూడలేదని స్థానికులు చెప్పుకుంటున్నారు.
అయితే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫేక్ అని గ్రామస్తులు పేర్కొంటున్నారు. యూట్యూబ్ లోని వీడియోని డౌన్ లోడ్ చేసి దానిని కరీంనగర్ జిల్లాలోని వెలిచాల జరిగినట్లు కొందరు ఫేక్ వీడియోని సృష్టించారని వివరిస్తున్నారు. ఇదంతా ఆకతాయిలు చేసిన పని అని, పాము అరిచే వీడియో నిజమైందని కాదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. దీనిని ఎవరూ నమ్మవద్దని కోరారు.