95 మందికి పాము కాట్లు..

by srinivas |
95 మందికి పాము కాట్లు..
X

దిశ ఏపీబ్యూరో : కృష్ణా జిల్లాను విషసర్పాలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రధానంగా పామర్రు నియోజకవర్గంలో ఆందోళన రేపుతున్నాయి. మొవ్వ ప్రభుత్వ ఆస్పత్రికి పాముకాటు బాధితులు పోటెత్తుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు అంటే 23 రోజుల వ్యవధిలో పాముకాటుతో 95 మంది ఈ ఆస్పత్రికి వచ్చారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.దీనిపై పీహెచ్సీ వైద్యాధికారి మాట్లాడుతూ.. ఒక్కరోజే పాముకాటుతో 9 మంది ఆస్పత్రికి వచ్చారంటే పాము కాట్ల తీవ్రత ఎలా ఉందో ఊహించండని అన్నారు. వర్షాకాలం ఆరంభం కావడంతో పొలం పనులకు ఎక్కువ మంది వెళ్తున్నారని, ఈ క్రమంలో పాము కాట్లకు గురవుతున్నారని వివరించారు. పనులకు వెళ్లిన వారు పొలంగట్లపై ఉండొద్దని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ స్నేక్ వెనమ్‌లను అందుబాటులో ఉంచామని వైద్యాధికారి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed