- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా లక్షణాలు కనిపెట్టే ‘స్మార్ట్ హెల్మెట్’
దిశ వెబ్ డెస్క్ : కరోనా రోజురోజుకు వ్యాప్తి చెందుతూనే ఉంది. ఒక వేళ పరిస్థితులు కుదట పడిని .. మరో రెండేళ్ల పాటు .. ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటించాలని ‘హార్వార్డ్’ విశ్వవిద్యాలయ నిపుణుల బృందం చెబుతోంది. కరోనాని అడ్డుకోవడానికి ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనాను నివారించాలంటే.. వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులను గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్‌లు అందుబాటులోకి వచ్చాయి.
కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దాదాపు 210 దేశాల్లో వైరస్ ప్రభావం ఉంది. కరోనాను నియంత్రించడానికి.. దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. కరోనా కట్టడికి ప్రజలందరినీ భౌతిక దూరం పాటించమని, మాస్క్ లు ధరించమని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. చాప కింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. దీనికి చెక్ చెప్పడానికి ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ కరోనా చైన్ ను కట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం, బాధితుల గుర్తింపు ఇప్పుడు స్మార్ట్ హెల్మెట్‌లు అందుబాటులోకి వచ్చాయి. దుబాయ్‌లోనూ వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వం వైరస్ గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్ లను వినియోగిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ హెల్మెట్లను అక్కడి పోలీసులకు, రవాణా శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం సరఫరా చేసింది. ఇందులో పరారుణ కాంతి కెమెరా, కృత్రిమ మేధస్సు, ముఖ గుర్తింపు సాంకేతిక పరికరాలను అమర్చారు. దీనివల్ల వీటిని పెట్టుకున్న ఉద్యోగి ముందు నుంచి వెళ్లే పాదచారులు, వాహనదారులను హెల్మెట్‌లోని థర్మల్ స్క్రీనింగ్ పరికరం స్కాన్ చేస్తుంది. వారి శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలను వారికి తెలియకుండానే గుర్తిస్తుంది. ఆ విధంగా బాధితులెవరైనా తమ ముందు నుంచి వెళ్లినట్టయితే తక్షణం వారిని పట్టుకుని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీనివల్ల బాధితుల నుంచి వారికి తెలియకుండానే ఇతరులకు వైరస్ వ్యాప్తి జరగకుండా కట్టడి చేయటం తేలికగా మారుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం పెద్ద సంఖ్యలో స్మార్ట్ హెల్మెట్ల వినియోగాన్ని అవలంభిస్తోంది. ఇదిలా ఉంటే.. కరోనా కు వ్యాక్సిన్ కనుగొనడానికి అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Tags : corona virus, lockdown, smart helmet, dubai,