- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవలలు పెళ్లాడిన కవలలు.. ఒకేసారి గర్భం!
ఆగస్టు 2018లో కవలలు పెళ్లాడిన కవలలు అంటూ అమెరికా మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన జంటలు ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆ ఇద్దరు కవల సోదరీమణులు ఒకేసారి గర్భం దాల్చారు. బ్రిటనీ, బ్రయానా డీన్ అనే ఇద్దరు సోదరీమణులు, జోష్, జెరేమీ సాల్యేర్‌లను ఆగస్టు 2018లో పెళ్లిచేసుకున్నారు. అప్పటి నుంచి వాళ్లను ఇంటర్నెట్‌లో సెలెబ్రిటీలుగా చూస్తున్నారు. ట్విన్‌సేన్ వెడ్డింగ్ అనే పేరుతో డాక్యుమెంటరీలు కూడా వచ్చాయి. సోషల్ మీడియాలోని ప్రతి పోస్టులోనూ వాళ్లు నలుగురూ కలిసి కనిపిస్తారు. అలా పాపులర్ అయిన ఈ జంటలు ఇప్పుడు మరో శుభవార్త చెప్పడంతో నెటిజన్లు సెలెబ్రేట్ చేస్తున్నారు.
వారు గర్భం దాల్చిన విషయాన్ని కూడా ఇన్‌స్టాగ్రాం ద్వారా తెలియజేశారు. ఇంకేముంది న్యూస్ చానళ్లు ఇంటికి క్యూ కట్టాయి. అలా ఒక ఇంటర్వ్యూలో వాళ్ల ఇద్దరికీ కూడా కవల పిల్లలు పుట్టాలని, అది కూడా ఒకేరోజున పుట్టాలని ఆశిస్తున్నట్లు జెరేమీ, జోష్ చెప్పారు. అయితే ఇదే ఇంటర్వ్యూలో వారి పోస్ట్‌లకు వచ్చిన కామెంట్ల గురించి కూడా జోష్, జెరెమీ క్లారిటీ ఇచ్చారు. గర్భం దాల్చారనే పోస్టుకి కొంతమంది నెటిజన్లు తప్పుగా కామెంట్ చేశారు. భర్తలు, భార్యలు ఒకేలా ఉన్నారు కదా.. గర్భాలు కూడా ఎవరివి వాళ్లవేనా లేక భర్తలను మార్చుకున్నారా? అని ఒకరు కామెంట్ చేశారు. ఈ కామెంట్‌ను జోష్, జెరెమీ జంటలు కొట్టిపారేశాయి. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆనా, లూసీ అనే ఇద్దరు కవల సోదరీమణులు.. ఒకే బాయ్‌ఫ్రెండ్‌తో గర్భం దాల్చిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నెటిజన్ ఇలాంటి కామెంట్ చేసి ఉంటాడని జోష్ స్పష్టతనిచ్చారు.