- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్యాన్ చేసినా వినలేదు!
దిశ, వెబ్‌డెస్క్ : వద్దు అన్న పనిని అదే పనిగా చేయడంలో భలే మజా వస్తుంది. ముఖ్యంగా భారతీయులు ఇందులో నిపుణులు. ఏదైతే వద్దని అంటామో.. అదే పనిని అందరి ముందు చేస్తారు. ఎందుకు వద్దన్నారనే దాని గురించి మంచి కారణం ఉన్న కూడా వినిపించుకోరు. దీపావళికి బాణసంచా నిషేధం విషయంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఉత్తర భారతదేశంలో పెరుగుతున్న గాలి కాలుష్యం, కరోనా నుంచి రికవరీ అయిన పేషెంట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా రాష్ట్రాల్లో బాణాసంచా కాల్చడం మీద పూర్తిగా నిషేధం విధించారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. క్రాకర్స్ కాల్చారు. బాధ్యతగల పౌరులుగా ప్రవర్తించకుండా రోడ్లను చెత్త చెత్త చేశారు.
ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో నిషేధం విధించినప్పటికీ వారణాసి వీధుల్లో, గంగా నదిలో కాల్చిన క్రాకర్స్ కనిపించాయి. అసలే చలికాలం. గాలి కనీసం పీల్చుకోదగిన విధంగా కూడా లేదు. అవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు బాణాసంచా మీద నిషేధం విధిస్తే, ఇలా క్రాకర్స్ కాల్చడం ఏమాత్రం సబబుకాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పైగా క్రాకర్స్ కాలుస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు మెసేజ్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. దీపావళికి ముందు బాణాసంచా కాల్చడం మీద నిషేధం గురించి పెద్ద పెద్ద పోస్టులు పెట్టి, లెక్చర్‌లు ఇచ్చి ఇప్పుడు బాణాసంచా కాల్చడం ఏంటని ఏకిపారేస్తున్నారు. అయితే బాధ్యతగా ప్రవర్తించిన వాళ్లందరినీ సోషల్ మీడియా మెచ్చుకుంటోంది.