- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఫ్రీ కంట్రీగా స్లోవేనియా!
తమ దేశం నుంచి కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయిందని స్లోవేనియా అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ ప్రకటన చేసిన మొదటి యురోపియన్ దేశంగా స్లోవేనియా నిలిచింది. గత రెండు వారాల్లో కొత్తగా ఏడు కేసులు మాత్రమే నమోదైన కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఇతర యురోపియన్ యూనియన్ దేశాల నుంచి వస్తున్న వారు మాత్రం కచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్ పాటించాలని సూచించింది.
20 లక్షల జనాభా ఉన్న ఈ దేశానికి ఇటలీ, ఆస్ట్రియా, హంగేరీ, క్రొయేషియా దేశాలు సరిహద్దుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ దేశంలో 1464 కేసులు నమోదుకాగా, 103 మంది చనిపోయారు. మార్చి 12వ తేదీన ఈ దేశం కరోనాను మహమ్మారిగా గుర్తించింది. గత రెండు నెలలుగా స్లోవేనియా కరోనాతో పోరాడి విజయం సాధించి మిగతా యూరప్ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ఆ దేశ ప్రధాని జానెజ్ జాన్సా ప్రకటించారు. విదేశాల నుంచి కరోనా లక్షణాలతో వచ్చేవారిని తమ దేశానికి రానివ్వబోమని తెగేసి చెప్పేశారు. ప్రజలు కొద్దిగా క్రమశిక్షణ పాటించాలని.. మాస్కులు, సామాజిక దూరం మెయింటెయిన్ చేయాలని చెప్పారు. ఇప్పటికే ప్రజారవాణాకు అనుమతించిన స్లోవేనియా.. ఈ వారాంతంలోగా హోటళ్లు, బార్లు, పాఠశాలలను కూడా తెరిచేందుకు సిద్ధమైంది.