- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ రాష్ట్రానికి మరో కలికితురాయి గేట్ వే ఐటీ పార్కు!
దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా కండ్లకోయ లో గేట్ వే ఐటీ పార్క్ కు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తో కలిసి గురువారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పట్టువదలకుండా పోరాడితేనే విజయం తథ్యమని, ఒకవేళ కేసీఆర్ రాజకీయాలను వీడి ఉంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వాళ్లమా..? అని అన్నారు. సీఎం కేసీఆర్ తొలి ఎన్నికల్లో ఓటమి చవిచూశారని, అయినా నిరుత్సాహపడకుండా రాజకీయాల్లో కొనసాగారని తెలిపారు.
ఎక్కడో సిద్ధిపేట సమీపంలోని చింతమడక అనే మారుమూల పల్లెలో పుట్టిన కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని తెలిపారు.11 మంది సంతానం తో మా తాత వ్యవసాయం చేస్తుండేవాడన్నారు. ఇంటర్, డిగ్రీ వరకు సిద్ధిపేటలోనే చదివి, ఈ తర్వాత పీజీ కోసం హైదరాబాద్ వచ్చారని తెలిపారు. తన మేనమామ ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటే తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, ప్రజా జీవితంలో కొనసాగుతానని చెప్పారని కేటీఆర్ తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టాలని కేసీఆర్ నిర్ణహించుకొని సొంతూరు వెళ్లారని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ ఎన్నికల్లో పోటీ చేసి సింగిల్ విండో ఎన్నికల్లో డైరెక్టర్ గా ఎన్నికయ్యారని తెలిపారు.
29 ఏళ్లకే ఎమ్మెల్యే టికెట్..
ఆ తర్వాత కొన్నాళ్లకు ఎన్టీ రామరావు తెలుగు దేశం పార్టీలో కేసీఆర్ చేరారని వివరించారు. రాజకీయాల్లో చురుకైనా పాత్రను పోశించడంతో రామారావు కేసీఆర్‌కు 29 ఏండ్ల వయసున్నప్పుడు.. 1983లో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. 750 ఓట్ల స్వల్ప తేడాతో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి చవిచూశారని తెలిపారు. ఒకవేళ ఆ ఓటమితో కేసీఆర్ నాడే రాజకీయాల నుంచి తప్పుకుని ఉంటే.. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉండేదా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారా? ఆలోచించాలన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు ఆయన వద్ద ఏం లేదు. 14 ఏండ్లు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణను సాధించారు. ఆ ఫలితంగానే ఇవాళ కండ్ల కోయలో ఐటీ పార్కును నిర్మించుకోబోతున్నాం.
ఐటీకి కేరాఫ్..
ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్, మైక్రోసాప్ట్ లాంటి కంపెనీల అతిపెద్ద క్యాంపస్ లు తమ కార్యకలాపాలను నగరంలో ప్రారంభించాయి. ప్రఖ్యాత కంపెనీలకు అమెరికా తర్వాత హైదరాబాద్ లోనే ప్రధాన కార్యాలయాలున్నాయి. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ కు భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఎంఆర్ఎఫ్ టైర్ల సంస్థ మరో వెయ్యి కోట్ల రూపాయాలను పెట్టుబడి పెట్టేందుకు ఉదయమే తనను సంప్రదించినట్లు తెలిపారు.
అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్..
ప్రపంచంలోనే అతిపెద్దదైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం తెలంగాణలో ఉంది. కేసీఆర్ దీన్ని మూడున్నర ఏండ్లలో పూర్తి చేశారు. కాళేశ్వరం నుంచి గజ్వేల్‌కు నీళ్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రపంచంలోనే మొత్తం టీకాల ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్ లోనే జరుగుతుందన్నారు. దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్రం 5 శాతాన్ని అందిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
కండ్లకోయ మరింత అభివృద్ధి..
ఉత్తర హైదరాబాద్‌లో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్‌కు వెళ్లి ఐటీ ఉద్యోగాలు చేయడం కంటే.. నార్త్ హైదరాబాద్‌లోనే ఐటీ ఉద్యోగాలు చేసేలా నగరానికి నలువైపులా ఐటీ పార్కులు నిర్మిస్తున్నాం. ఈ గేట్ వే ఐటీ పార్కు ద్వారా వేలాది మంది పిల్లలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తర హైదరాబాద్‌కు ఇది ఆరంభం ప్రారంభం మాత్రమే. ఈ ప్రాంతంలో మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. దగ్గరలోనే ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని కేటీఆర్ అన్నారు.
గులాబీ పువ్వు అంటే ఫైర్.. మంత్రి మల్లారెడ్డి
గులాబీ పువ్వు అంటే పువ్వు అనుకుంటివా.. పువ్వు కాదు..అది ఫైర్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పుష్ప సినిమా డైలాగ్స్ తో అలరించారు. తాను కష్టపడకుండానే ఈ స్థాయికి రాలేదన్నారు. ఒకప్పుడు పాలు అమ్మి జీవనం కొనసాగించిన నేను మంత్రి స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. నిరంతరం కష్టపడ్డాను కాబట్టే దేశంలోనే టాప్ 10 విద్యాసంస్థల అధినేతగా ఎదిగినట్లు సీఎం కేసీఆర్ ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారని తాను ఊహించలేదన్నారు. ఇక్కడ ఐటీ పార్కు రావడం మన అదృష్టమని తెలిపారు. ఒకప్పుడు ఐటీ అంటే మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ మాత్రమేనన్నారు. ఇప్పుడు ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు నార్త్ సైడ్ విస్తరిస్తున్నాయి. ఒక లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మేడ్చల్ జిల్లాలో ఉన్నారు. రాబోయే రోజులు మీవే అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
విజయానికి నాలుగు సూత్రాలు..
నా విజయానికి నాలుగు సీక్రెట్లు ఉన్నాయి అని మంత్రి తెలిపారు. టైం, డబ్బులు వృథా చేయొద్దు. గౌరవంగా ఉండాలి.. క్రమశిక్షణతో మెలగాలి. చైనా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయంటే వారు పక్కా ప్రణాళిక, హార్డ్ వర్క్ తో ముందుకెళ్తున్నారు. అందుకే ఆయా దేశాలు ప్రపంచంలోనే ముందంజలో ఉన్నాయి. ప్రపంచాన్ని జయించే అవకాశం తెలంగాణ యువతకు ఉందన్నారు. కేటీఆర్ దావోస్ వెళ్లి రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించారు.
మన హైదరాబాద్ ఐటీలో నంబర్ వన్‌లో నిలిచింది. టాప్ 5 కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి. ఈ ఘనత కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదంతో మంత్రి స్థాయికి ఎదిగాను అని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఎస్సీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి ఎమ్మెల్యేలు కే.పి.వివేకానంద్ గౌడ్, మాధవరం కృష్ణారావు, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్ నరసింహ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.