- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ
దిశ, న్యూస్‌బ్యూరో: నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. వారి వారి విద్యార్హతలను బట్టి యువతకు ఏ రంగంలో శిక్షణ ఇస్తే బాగుంటుందో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో సంక్షేమ భవనంలో మంత్రి ఈశ్వర్ సమావేశం నిర్వహించారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ రంగాలలో ఇచ్చే నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల గురించి ప్రొజెక్టర్ ద్వారా డైరెక్టర్లు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు బీహార్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్ లాంటి రాష్ట్రాలకు తరలిపోవడం వల్ల రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయన్నారు. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తే ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలకు లోటుండదని వివరించారు. నిర్మాణ రంగం, డ్రైవింగ్, విద్యుత్, భూసర్వే లాంటి శాఖల్లో శిక్షణ పొందిన వారికి ఎన్నో ఉపాధి మార్గాలు ఉన్నాయన్నారు. ఎస్సీ,ఎస్టీలను విద్యావంతులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల వ్యవస్థను బలోపేతం చేస్తుందని కొనియాడారు.