- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏవీ సుబ్బారెడ్డి హత్యకు స్కెచ్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ నేత, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి హత్యకు స్కెచ్ వేసిన వ్యక్తులను కడప పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవింద పల్లెకు చెందిన గంగదాసరి రవిచంద్రారెడ్డి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంటకు చెందిన రామిరెడ్డిలు ఏవీ సుబ్బారెడ్డిని హతమార్చేందుకు ప్లాన్ చేశారు.
దానిని అమలు చేసేందుకు సూడో నక్షలైట్‌గా పేర్కొనే అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సంధ్యపాకుల పక్కీర్ అలియాస్ సంజురెడ్డి అలియాస్ మున్నాను కలిసి 50 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలుత 15 లక్షల రూపాయలు తరువాత 35 లక్షలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. హైదరాబాదులోనే సుబ్బారెడ్డిని హతమార్చాలని భావించి పక్కీర్‌ను అక్కడికి తీసుకెళ్లారు. ఐదుసార్లు ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి, ఈ నెల 12న హతమార్చాలని నిర్ణయించుకున్నారు. పక్కీర్ ఆరోజు తెల్లవారు జామున పిస్తోలుతో ఆయన ఇంటికి వెళ్లాడు.
ఇంతలో అటుగా పెట్రోలింగ్ వాహనం రావడంతో భయపడి.. ఈ పని ఒక్కడి వల్ల కాదని, మరొకరి సహాయం కావాలని వారికి చెప్పాడు. దీంతో వారు కడపకు రమ్మని చెప్పారు. ఈ ముగ్గురు కలిసి ఓబుల్‌రెడ్డి టీ దుకాణంలో కూర్చుని హత్యకు పథకం వేస్తుండడంతో స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో పాత బైపాస్ కూడలి వద్ద బ్యాగుతో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ముగ్గుర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారి కుట్ర కోణం వెలుగు చూసింది. పిస్తోలు బీహార్‌లో కొనుగోలు చేశానని పక్కీర్ వెల్లడించాడు.
Tags: murder plan, av subba reddy, kadapa, 3 accused arrested