- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులపై కరోనా పిడుగు.. 16 మంది మృతి
దిశ, తెలంగాణ బ్యూరో : జర్నలిస్టులపై కరోనా పిడుగు పడుతోంది. కరోనా రోజురోజుకు ఉధృతే కాదు జర్నలిస్టులపై అదే స్థాయిలో తన ప్రభావం చూపుతోంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే రాష్ట్రంలో 10 మంది మృతి చెందారు. చాలా మంది జర్నలిస్టులు కరోనాతో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయినా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ తమ సంస్థలకు సేవలందిస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ర్టంలో వివిధ కారణాలతో మొత్తం 270 మంది మృతి చెందారు. 93 మంది తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురయ్యారు. నిస్సాహాయ స్థితిలో 500 ల మంది ఉన్నారు. పస్ట్, సెకండ్ వేలో 1950 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇదిలా ఉంటే మొదటి దఫాలో ఏపీలో 39 మంది మంది, తెలంగాణలో ఆరుగురు జర్నలిస్టులు మృతి చెందారు.
కరోనా ఫస్ట్‌వేవ్‌లో తెలంగాణలో మృతి చెందిన వారి వివరాలు..
1. మనోజ్ టీవీ-5 క్రైం రిపోర్టర్
2. వాసం లక్ష్మీనారాయణ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ నాగర్ కర్నూల్
3. శ్రీనివాస్ ఫొటో గ్రాఫర్ వరంగల్
4. అల్లాడి శేఖర్ ఆంధ్రప్రభ రిపోర్టర్ చందూర్తి, సిరిసిల్ల జిల్లా
5. ప్రకాశ్ టీన్యూస్ కెమెరామెన్
6. జీఎల్ఎన్ మూర్తి ఆంధ్రజ్యోతి కల్చర్ రిపోర్టర్
ఈ ఏడాది సెకండ్ వేవ్‌లో..
1. కె.అమర్‌నాథ్ సీనియర్ జర్నలిస్టు హైదరాబాద్
2. జయప్రకాశ్ జర్నలిస్టు కరీంనగర్
3. శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ యాచారం, రంగారెడ్డి
4. సాయినాథ్ 99 టీవీ రిపోర్టర్ నిర్మల్ జిల్లా
5. డి. అశోక్ ఆంధ్రభూమి రిపోర్టర్ నిజామాబాద్
6. బుర్ర రమేష్ జర్నలిస్టు వేములవాడ, సిరిసిల్లజిల్లా
7. పి.రమేష్ జర్నలిస్టు కరీంనగర్
8. సీహెచ్ నాగరాజు ఈనాడు రిపోర్టర్ సిద్దిపేట
9. రామచంద్రారావు సాక్షి సబ్-ఎడిటర్ హైదరాబాద్
10. కల్పన బతుకమ్మ టీవీ హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లో..
1. పి.తాతయ్య సీనియర్ జర్నలిస్టు ఒంగోలు
2. చంద్రశేఖర్ నాయకుడు ఎన్‌టీవీరిపోర్టర్ శ్రీకాకుళం
3. శ్రీనివాసరావు ప్రజాశక్తి రిపోర్టర్ జగ్గయ్యపేట, కృష్ణజిల్లా
4. సాయి ఆంధ్రప్రభ రిపోర్టర్ విజయవాడ
5. సుంకర రామారావు జర్నలిస్టు తూర్పుగోదావరి
6. ప్రభాకర్ రెడ్డి సాక్షి కడప
7. సూర్యప్రకాశ్ పరవాడ, విశాఖపట్నం
8. మండల చంద్రశేఖర్ నాయుడు ఎన్టీవీ పాలకొండ
9. కోటేశ్వరరావు ఫ్రీలాన్సర్ నెల్లూరు
ఆంధ్రప్రదేశ్‌లో మెుదటి వేవ్‌లో 38 మంది మృతి చెందగా సేకరించిన కొంత మంది పేర్లు
1. పార్థసారథి సీవీఆర్ న్యూస్ చిత్తూరు
2. మురళీమోహన్ రెడ్డి సిటీ కేబుల్ చిత్తూరు
3. మదన్ మోహన్‌రెడ్డి ఎన్టీవీ చిత్తూరు
4. మూర్తి ప్రజాశక్తి చిత్తూరు
5. భమిడిపాటి శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్ట్ తూర్పుగోదావరి
6. అడబాల వాసు సీనియర్ జర్నలిస్ట్ తూర్పుగోదావరి
7. మధుసూదన్ రెడ్డి ఎన్టీవీ కడప
8. వెంకట సుబ్బయ్య నేటి ప్రస్థానం కడప
9. బీఎన్ రామారావు సీనియర్ రిపోర్టర్ విశాఖపట్నం
10. పార్థసారథి విశాఖపట్నం
11. డలారి ఏడుకొండలు స్వయంశక్తి దినపత్రిక శ్రీకాకుళం
12. మూర్తి వీడియో జర్నలిస్ట్ నెల్లూరు.