- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరేళ్ల తర్వాత అయినవారి చెంతకు.
దిశ, మెదక్:
ఆ క్షణాల కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన వారి నిరీక్షణ ఫలించింది. అయిన వారి కోసం ఇన్నాళ్లు వెతికిన ఆ కళ్లు తనవారు కనిపించగానే ఆనంద భాష్పాలతో చెమగిల్లాయి. ఎవరూ లేని వారిగా బతికిన వారికి ఇప్పుడు ఓ ఆదెరువు దొరికింది. అధికారుల అన్వేషణ, చిన్నారుల నిరీక్షణ ఫలించి నాన్న చెంతకు చేరారు ఇద్దరు చిన్నారులు.
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం నాగసాన్పల్లి గ్రామానికి చెందిన బేబీ మహామూడా (17), బేబీ సకీనా (12) ఇద్దరు అక్కాచెల్లెళ్లు. 2014లో వీరి అమ్మ చనిపోవడంతో నాన్న వజీర్ వీరిద్దరిని పట్టించుకోవడం మానేశాడు. దీంతో పిల్లలిద్దరూ రైలు మార్గాన హైదరాబాద్ చేరుకున్నారు. వీరిని గుర్తించిన అధికారులు బాలల సంక్షేమ సమితి హైదరాబాద్ వారి ఆదేశాలతో మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్న బెథని సంరక్షణ ఆశ్రమంలో 2014 ఆగస్టు 4న జాయిన్ చేశారు. ఆ ఇద్దరు చిన్నారులు ఇన్నేళ్లు అక్కడే ఆశ్రయం పొందారు. చిన్నారులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం.. వారి తల్లిదండ్రుల కోసం అన్వేషించిన అధికారులు వనపర్తి జిల్లాలో అయిన వారు ఉన్నారని తెలుసుకుని పిలిపించారు. పిల్లలిద్దరు తమ తండ్రి వెంట వెళ్లేందుకు అంగీకరించడంతో సంబంధిత అధికారులు గురువారం బేబీ మహామూడా, సకీనాలను వజీర్ కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు కైలాస్, అత్మరాములు, సీడీపీవో భార్గవి, ఐసీపీఎస్ సిబ్బంది నాగరాజు, ఆంజనేయులు మధుకర్, భరత్, మహేష్, చైల్డ్ లైన్ నోడల్ కో ఆర్డినేటర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.