ఏడో పెళ్లికి సిద్ధమైన తాత.. ఆ ‘పని’కోసమేనట!

by Anukaran |
ఏడో పెళ్లికి సిద్ధమైన తాత.. ఆ ‘పని’కోసమేనట!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆయన వయస్సు ఆరు పదులు దాటింది. వృద్ధాప్యంలో మనుమండ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన వయసు. కానీ ఆ ముదుసలి తాత తనకు పెండ్లి చేయాలని పట్టుపడుతున్నాడు. ఆయనకు తోడు లేక అడుగుతుండు అనుకుంటే మీరు పొరబడిపట్టే. ఇప్పటికే ఆరుగురు భార్యలున్న ముద్దుల ముసలి మొగుడు అతడు. మరీ ఏడో భార్య ఎందుకు అనుకుంటున్నారా..? ఇంకేందుకు ఆయనకు ‘కావాల్సిన’ పనులు చేసి పెట్టాలట.

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన రైతు(73) పెళ్లి కోసం తాపత్రాయ పడుతున్నాడు. ధనవంతుడైన ఆ రైతు ఇప్పటికే ఆరుగురు మహిళలను వివాహమాడి వదిలేశాడు. తాజాగా ఏడో భార్య కోసం వధువు కావాలని తిరుగుతున్నాడు. 2020 సెప్టెంబర్‌లోనే 40 ఏండ్ల మహిళలను ఆరో వివాహం చేసుకున్నాడు. అదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఆమె దాంపత్య జీవితానికి దూరం పెట్టింది. దీంతో ఆమెతో డిసెంబర్ నెలలోనే తెగదెంపులు చేసుకోని ఏడో భార్య కోసం వెతుకులాట ప్రారంభించాడు.

అయితే తన వివాహం సమయంలో ఇస్తానన్న నగదు, ఇల్లు ఇవ్వకుండనే ఏడో వివాహానికి సిద్ధమైయ్యాడని ఆరో భార్య అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వృద్ధ పెళ్లి కొడుకు బాగోతం బయటపడింది. ఒంటరి, వితంతు మహిళలకు డబ్బును ఎరగా చూపి వివాహమాడి తన ‘అవసరాలు’తీర్చుకోని వదిలేస్తాడని పోలీసుల విచారణలో తేలింది. తనకు గతంలో జరిగిన వివాహాలను దాచి మహిళలను మోసి చేస్తున్నట్లు గుర్తించారు.

అయితే వృద్ధ పెళ్లి కొడుకు వాదన మరోలా ఉన్నది. తమ మతాచారాల ప్రకారం ఎన్ని పెళ్లిళ్లైన చేసుకోచ్చని వాదిస్తున్నాడు. మరోవైపు తనకు ఆరోగ్యం బాగలేదని గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని పేర్కొంటున్నాడు. మలి దశలో తనకు సేవలు చేయడానికే తోడు కోసం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పోలీసులతో వాదిస్తున్నాడు. అయినా అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story