- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరుతడి పంటలు సాగు చేయాలి: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి..
దిశ, మద్దిరాల: యాసంగిలో వరి పంటకు బదులు రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గోరంట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు వరి వేయకుండా ఆరుతడి పంటలైన మినుములు, వేరుశనగ, పెసర, పొద్దుతిరుగుడు కందులు వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. యాసంగిలో ఎఫ్.సి.ఐ ధాన్యం కొనుగోలు చేయడం లేదు కాబట్టి వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఆరుతడి పంటలపై సలహాలు తీసుకుని అధిక దిగుబడులు సాధించాలని తెలిపారు.
రైతులు ఇప్పటికీ వరి పంట వేయడానికి సిద్ధమైతే రైతులే స్వయంగా ధాన్యం అమ్ముకోవాలని తెలిపారు. వసతులు ఉన్న రైతులు కూరగాయలతో పామాయిల్ సాగు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ, మండల వ్యవసాయ అధికారి డి వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ దామెర్ల వెంకన్న, పంచాయతీ కార్యదర్శి మంగమ్మ, వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్, ఎంపీటీసీ శిరం శెట్టి వెంకన్న, గ్రామ ఉప సర్పంచ్ అంగిరేకుల వెంకన్న, రైతులు బద్దం సంజీవరెడ్డి, అమృత రెడ్డి, ఉప్పల్ రెడ్డి, అశోక్, భాస్కర్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.