- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్ జిల్లాలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంగళవారం వైద్యాధికారులు ధృవీకరించారు. అందులో ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామంలో మరో నలుగురికి కరోనా పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్టు తెలిపారు. ఇటీవల కరోనా సోకిన ఓ వ్యక్తి భార్య, మేనత్త, తల్లితోపాటు స్నేహితుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారితో ప్రాథమికంగా సంబంధం ఉన్నా మరో 23 మందిని హోం క్వారంటైన్ కు పంపించారు. సోమవారం నిజామాబాద్ రూరల్ మండలం ధర్మారంలో పాజిటివ్ లక్షణాలతో చనిపోయిన ఓ మహిళ భర్తకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. అదేవిధంగా మాధవ నగర్ కు చెందిన మరో మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ వచ్చిన వీరిని ఆసుపత్రికి తరలించారు. వారితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల తరువాత 26 మందికి కరోనా సోకింది. ఇద్దరు ఎమ్మెల్యేలకు కోవిడ్ సోకింది. రూరల్ ఏమ్మెల్యే కుటుంబ సభ్యులు, సహాయకులకు కరోనా లేదని రిపోర్టులు వచ్చాయి. వైరస్ అనుమానిత లక్షణాలతో పరీక్షలు చేయించుకున్న ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ కు నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.