- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరుగురిని మింగిన వసంతవాడ వాగు..!
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఆరుగురు బాలురు వసంతవాడ వాగులో మునిగి దుర్మరణం చెందారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం బూదేవిపేట గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. వన భోజనాలు చేసేందుకు పలువురు పెదవాగుకు వెళ్లారు. ఈ క్రమంలోనే సరదాగా వసంతవాడ వాగులో ఈత కొట్టేందుకు దిగారు. అంతలోనే ఆరుగురు బాలురు ప్రవాహంలో గల్లంతయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం వరకు గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు భూదేవి పేటకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులంతా 15 నుంచి16 ఏండ్ల మధ్య వయసు వారిగా తేలింది. అనంతరం ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ పరిశీలించగా.. బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పరామర్శించారు.
మృతులు వివరాలు :
1) గంగాధర వెంకట్రావు (16)
2) శ్రీరాముల శివాజీ (16)
3) గొట్టుపర్తి మనోజ్ (16)
4) కర్నటి రంజిత్ (15)
5) కెల్లాసాయి (16)
6) కూనవరపు రాధాకృష్ణ (15).