- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూర్యాపేట జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం
దిశ, సూర్యాపేట : జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఆరు కేసులు నమోదైనట్లు మెడికల్ ఆఫీసర్లు గుర్తించారు. జిల్లాలోని సూర్యాపేట లో రెండు, కోదాడ, మద్దిరాల, నేరేడు చర్ల మండలాలలో ఒక్కొక్క కేసు నమోదైనట్లు డిఎంహెచ్ఓ కోట చలం పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితం సూర్యాపేటకి చెందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడడంతో హైదరాబాద్ సరోజినీ దేవి ఈఎన్టీ హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కొరకు పంపించారు. వరుసగా మూడు రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తుండడంతో హైదరాబాద్ కు రిఫర్ చేస్తున్నారు.
అదే విదంగా సూర్యాపేట కి చెందిన ఒక వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉండడంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు సమాచారం. ఇలాఒక్కొక్క కేసు బయటపడుతుండడంతో హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించేందుకు డీఎంహెచ్ఓ కోట చలం చర్యలు చేపట్టాలని ఆఫీసర్లకు ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే ఈఎన్టీ డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు.