సవాళ్లు ఎదురైనా వృద్ధి బాటలోనే పెయింట్ ఇండస్ట్రీ..

by Harish |
burger
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత పరిస్థితులు సంక్లిష్ఠంగా ఉన్నప్పటికీ దేశీయంగా పెయింటింగ్ పరిశ్రమ మెరుగైన డిమాండ్‌ను సాధించగలదని ప్రముఖ పెయింట్ తయారీ సంస్థ బెర్జర్ పెయింట్స్ వెల్లడించింది. ముఖ్యంగా సురక్షితమైన పెయింట్ తయారీ, గ్రామీణ మార్కెట్లలో ప్రీమియం కాని ఉత్పత్తుల అమ్మకాల నేపథ్యంలో వృద్ధి సామర్థ్యం సాధించే వీలుంటుందని కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. అంతేకాకుండా, పరిశ్రమలో పోటీతత్వం క్రమంగా పెరుగుతోందని, భారత్ లాంటి మార్కెట్లో పెయింట్ వినియోగం క్రమంగా పెరిగే ధోరణిని సూచిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.

ఇంటి అవసరాలు పెరగడం, అంటువ్యాధుల వంటి సున్నిత అంశాల కారణంగా నాణ్యమైన పెయింట్ కోసం వినియోగదారుల ఎంపిక మారిందని, ఇది పరిశ్రమకు కలిసొస్తుందని పేర్కొంది. దీనికితోడు, కేంద్రం మౌలిక సదుపాయాలను పెంచేందుకు ముందుకు రావడం, వాటర్‌ప్రూఫింగ్, ఇంటి పరిశుభ్రత, భిన్న ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం వంటి పరిణామాలతో సవాళ్లను ఎదుర్కొంటున్న పరిశ్రమకు సానుకూల అంశాలు. ఇటీవల చాలాంది సొంత ఇంటిని కలిగి ఉండటమనే లక్ష్యాన్ని కలిగి ఉండటంతో పెయింటింగ్‌కి డిమాండ్ పుంజుకుంటోంది.

ఇది పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. పలు నివేదికల ప్రకారం.. భారత పెయింట్ పరిశ్రమ మొత్తం రూ. 50,000 కోట్ల టర్నోవర్‌ను కలిగి ఉన్నట్టు అంచనా. గతేడాది కొవిడ్ మహమ్మారి పరిస్థితులతో పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఏడాది సెకెండ్ వేవ్ కారణంగా పరిస్థితి ప్రతికూలంగానే కొనసాగుతోందని, అయినా సరే సవాళ్లను అధిగమించగలమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed