అమ్మమ్మలా అదరగొట్టిన సితార.. వీడియో వైరల్

by Shyam |   ( Updated:2023-07-28 04:58:15.0  )
Sithara
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు డాటర్ సితార సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఇన్ స్టా అకౌంట్‌లో రెగ్యులర్‌గా ఇంట్రెస్టింగ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా, ఆమెకు ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. తాజాగా సితార తన అమ్మమ్మ మీనాక్షి శిరోద్కర్‌ నటించిన పాత సినిమా‌లోని ఒక పాట వీడియో షేర్ చేసింది. 1938లో వచ్చిన ‘బ్రహ్మచారి’ చిత్రంలోని ‘యమున జలి ఖేలు ఖేల్’ పాటలో మీనాక్షి శిరోద్కర్ స్విమ్మింగ్ పూల్‌లో ఎలా డ్యాన్స్ చేశారో అచ్చం అలానే యాక్ట్ చేసేందుకు సితార ప్రయత్నించింది. ‘నేను ఆమె పాటను ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించాను. నేను న్యాయం చేశాను అని భావిస్తున్నాను’ అనే క్యాప్షన్ తో వీడియో పోస్ట్ చేయగా.. అమ్మమ్మను సితార గొప్పగా అనుకరించిందని కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా, సితార మరో సూపర్ స్టార్ అని మహేశ్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. కాగా సితార షేర్ చేసిన ఈ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story