నవంబర్ నుంచి ‘సితార’:శోభిత

by Jakkula Samataha |
నవంబర్ నుంచి ‘సితార’:శోభిత
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ అండ్ టాలెంటెండ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘సితార’. రోని స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేమ, అంగీకారం క్షమించడమే జీవితం అనే కాన్సెప్ట్‌తో సూపర్ ఎంటర్టెన్మెంట్‌తో రూపుదిద్దుకుంటుంది. ఇంతకు ముందే సినిమాను ప్రకటించినా..లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. వందనా కటారియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నవంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుండగా, ఓటిటిలోనే సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. కాగా, సితార సినిమా తనకు చాలా చాలా స్పెషల్ అని చెప్తుంది శోభిత.

సితార ఇండియన్ సినిమా‌కు కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో తీసుకునే చిన్న స్టెప్ అని తెలిపింది. స్ట్రాంగ్ మైండ్ అండ్ బాడీ‌తో ఉన్న మూవీ యూనిట్ సూపర్ స్పిరిట్‌తో సెట్స్ మీదకు వెళ్తున్నట్లు చెప్పింది. ఓ బేకార్ ఫ్యామిలీ ఇచ్చే సూపర్ ఎంటర్‌టైన్మెంట్ సితార అని చెప్పిన శోభిత.. డిజిటల్ ప్లాట్ ఫాంలో ఎంజాయ్ చేసేందుకు రెడీ అయిపోమని చెప్తుంది. రాజీవ్ సిద్ధార్థ, శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

Next Story