- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వికాస్ దూబే నేర చరిత్రపై సిట్

X
లక్నో: శుక్రవారం ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే నేరస్తుడిగా ఎదిగిన వైనం, ఎనిమిది మంది పోలీసులను ఎలా చంపగలిగాడనే అంశాలపై విచారణకు ఉత్తరప్రదేశ్ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది పోలీసులను చంపే ఘటనకు ముందు పోలీసులు, లేదా నిఘా వైఫల్యాలున్నాయా? ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి? గతంలో అతనిపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారా? లేదా? నేరస్తులని తెలిసినా వారికి ఆయుధాల లైసెన్సులు ఎలా మంజూరైంది? ఎవరు చేశారు? ఇంతటి కరుడుగట్టిన నేరస్తుడైనా బెయిల్‌పై ఎలా ఉన్నాడు? గూండా యాక్ట్, ఎన్‌ఎస్ఏ, గ్యాంగ్‌స్టర్ యాక్ట్ సహా పలుచట్టాల కింద అతనిపై ఏ చర్యలు తీసుకున్నారు? లాంటి విషయాలపై సీనియర్ ఐఏఎస్, ఇద్దరు ఐపీఎస్‌లు సహా ఇతర అధికారులతో ఏర్పడిన ఈ సిట్ దర్యాప్తు చేయనుంది.
Next Story