- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అక్కాచెల్లెలు ఆత్మహత్యాయత్నం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా హిందూపురంలో విషాదం చోటుచేసుకుంది. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆయన ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారం ప్రకారం.. రెండు నెలల క్రితం హిందూపురానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ రంగనాయక్ కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆయన ఇద్దరు కూతుళ్లు తండ్రినే తలుచుకుంటూ బాధపడుతున్నారు. నెలలు గడిచినా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఇద్దరు కూతుళ్లు బుధవారం తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహ్యత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబీకులు ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. కాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Next Story