అక్కతో బావ లొల్లి.. అదును చూసి చెల్లితో బావ..

by Shamantha N |
cheating husband
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి సమాజంలో రోజురోజుకు బంధాల విలువ పడిపోతోంది. అలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని కన్యాడికి చెందిన మహ్మద్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు సౌధా, రైహానా లు ఉన్నారు. 8నెలల క్రితమే పెద్ద కుమార్తె సౌధాను ముస్తాఫా ఇచ్చి పెళ్లి చేశారు. దీంతో అత్తారింటికి వచ్చివెళ్లే క్రమంలో రైహానాతో పరిచయం కాస్తా ఫోన్లలో మాట్లాడుకునేంత వరకు వచ్చింది.

అప్పటికే సౌధా, ముస్తాఫాల మధ్య గొడవలు మొదలవడంతో, సౌధా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే ఈ నెల 8న ముస్తాఫా తమ ఇంటికి వచ్చి రైహానాను కారులో ఎక్కించుకొని వెళ్లిపోయాడని తండ్రి మహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story