కనుల పండువగా సిరిమానోత్సవం

by srinivas |
Grand Celebrations
X

దిశ, ఏపీ బ్యూరో: ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోరికలు తీర్చే కల్పవల్లి అయిన పైడితల్లి ఉత్సవాల్లో ప్రధానమైన సిరిమానోత్సవం కనుల పండువగా జరిగింది. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు పైడితల్లి ఆలయ అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులు కోట బురుజుపై ఆశీనులయ్యారు. సిరిమాను ఉత్సవాలను తిలకించారు. మరోవైపు రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ దంపతులు, వైసీపీ నేతలు బిల్డింగ్‌పై నుంచి అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకించారు.

Sirimanotsavam

సిరిమానోత్సవాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కరోనా నిబంధనలు ఉన్నప్పటికీ అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఇకపోతే ఈసారి సంచయిత గజపతి సిరిమాను ఉత్సవానికి దూరమయ్యారు. గతేడాది మాన్సాస్ చైర్మన్ హోదాలో ఈ వేడుకల్లో పాల్గొన్న సంచయిత ఈసారి ఉత్సవాల్లో కనిపించలేదు. ఆమె ఇటీవల కోర్టు ఆదేశాల నేపథ్యంలో మాన్సాస్ చైర్ పర్సన్ బాధ్యతల నుంచి తప్పుకోవడం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed