చైనా వ్యాక్సిన్ ఆ ఏజ్ వారిపై పనిచేయదు : పాక్

by vinod kumar |   ( Updated:2021-02-05 07:07:20.0  )
చైనా వ్యాక్సిన్ ఆ ఏజ్ వారిపై పనిచేయదు : పాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు చైనాపై ద్వేషాన్ని పెంచుకున్నాయి. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం కరోనా వైరస్‌ను డ్రాగన్ కంట్రీయే సృష్టించి తమ దేశం మీదుకు వదిలిందని చాలాసార్లు ఆరోపించారు.దీంతో చైనా తయారీ కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలు దూరం పెట్టాయి. కానీ, చైనాను మిత్రదేశంగా భావిస్తున్న పాక్ మాత్రం ఆ కంట్రీ నుంచి కరోనా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసింది.

‘సినోఫార్మ్’ అనే పేరు గల వ్యాక్సిన్‌ను తమ దేశపౌరుల మీద పాక్ ఉపయోగించింది. అయితే, 60 ఏళ్ల పైబడిన వ్యక్తులపై సినోఫార్మ్ వినియోగించరాదని ఎక్స్‌పర్ట్ కమిటీ సూచించింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక ఆరోగ్య సహాయదారుడు ఫైసల్ సుల్తాన్ సైతం ధృవీకరించాడు. కాగా, చైనా వ్యాక్సిన్ ఉపయోగించిన మరుసటి రోజే ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed