పాజిటివ్‌గా ఉండమంటున్న సునీత

by Jakkula Samataha |
పాజిటివ్‌గా ఉండమంటున్న సునీత
X

ప్రముఖ సింగర్ సునీత.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గులాబీ సినిమాలో ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు..’ అనే పాటతో తన సినీ పయాణాన్ని మొదలు పెట్టిన సునీత.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ టాప్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో మరపురాని పాటలకు తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. అటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సింగర్ సునీతకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే తన కెమెరాలో బంధించిన ప్రకృతి ఫొటోలను షేర్ చేసుకుంటూ.. మంచి కొటేషన్‌లు పెడుతుంటారు. ఇటీవలే ఎన్నో రంగుల్ని పులుముకున్న ఆకాశాన్ని ఫొటో తీసి షేర్ చేసిన సునీత.. ‘ఆకాశం ఒకటే, వర్ణాలెన్నో.. మనుషులంతా ఒకటే, మలినాలెన్నో’ అంటూ రాసుకొచ్చారు.

ఆ తర్వాత ఇటీవలే భోరున వర్షం పడటానికి ముందు.. ‘నీలి ఆకాశం కాస్త.. ఇంద్రధనస్సు రంగులతో కొత్త కొత్త రంగుల్ని తనలో పులుముకుంది. ఆ రంగుల ఆకాశాన్ని ఫొటో తీయలేకుండా ఉండలేకపోతున్నాను. ఆ రంగులంటే నాకెంతో ఇష్టం’ అంటూ తన అభిమానులతో షేర్ చేసుకుంది. తాజాగా తన కాటుక కనులతో దిగిన ఓ ఫొటోను షేర్ చేసుకుంటూ.. ‘పాజిటివ్, సంతోషం, ఆశతో ఉంటే.. అంతా మంచే జరుగుతుంది. అంతా మంచిగానే ఉంటుంది’ అని చెప్పింది. కరోనా కాలంలో.. పాజిటివ్ మాట వింటేనే భయపడిపోతున్న జనాలకు సునీత మాటలు.. ఎంతవరకు పాజిటివ్ వైబ్స్ కలిగిస్తాయో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed