ఘంటసాల వారసుడిగా…

by srinivas |   ( Updated:2023-06-08 12:21:26.0  )
ఘంటసాల వారసుడిగా…
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ పరిశ్రమలో అప్పటికే ఎంతో గుర్తింపు ఉన్న ఘంటసాలకు తోడుగా ఎస్పీ బాలు కూడా ఎంటర్ అయ్యారు. చెల్లెలి కాపురం లాంటి చిత్రాల్లో ఘంటసాలతో కలిసి బాలు పాడారు. నటుల హావభావాలకు, శైలికి అనుగుణంగా భిన్నమైన గొంతుతో పాటలు పాడి నటులకు ప్రాణం పోశారు. అమర గాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ ప్రపంచంలో నేపథ్య గాయకులకు చిరునామాగా మారారు. పదాల స్పష్టమైన ఉచ్ఛారణ శంకరాభరణం, సాగరసంగమం లాంటి చిత్రాల ద్వారా పండిత పామరులకి దగ్గరచేసింది. దక్షిణాది వ్యక్తుల హిందీ భాష ఉచ్ఛారణను ఉత్తరాది ప్రజలు పెద్దగా ఇష్టపడకపోయినప్పటికీ ‘ఏక్ దుజే కేలియే’ లాంటి హిందీ చిత్రాలకు పాడిన పాటలు మొత్తం దేశ ప్రజలందరినీ ఉర్రూతలూగించాయి.

Advertisement

Next Story