అలాంటి వారి పక్కలో పడుకుంటే ఇలాగే అవుతుంది.. సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్

by Anukaran |   ( Updated:2021-10-14 02:04:10.0  )
అలాంటి వారి పక్కలో పడుకుంటే ఇలాగే అవుతుంది.. సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వాయిస్ కి ఫిదా కానీ సంగీత అభిమాని లేరు. ఇక చిన్మయి పాటలతోనే కాకుండా సోషల్ యాక్టివిస్ట్ గా కూడా పేరు సంపాదించింది. మహిళపై జరిగే అఘాయిత్యాలను తనకు తగ్గ రీతిలో ఎదుర్కొంటోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే చిన్మయి ఏ పోస్ట్ పెట్టినా వైరల్ గా మారుతోంది. సమంత కు చిన్మయి ఆత్మలాంటిదన్న విషయం తెల్సిందే. ఇటీవల సామ్ విడాకులపై, పెళ్లి తరువాత మహిళల మనోభావాలపై గట్టిగానే క్లాస్ తీసుకున్న అమ్మడు తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేసింది.

యానిమల్స్ కామెడీ అకౌంట్ నుంచి ఒక వీడియోను ఆమె పోస్ట్ చేసింది. అందులో గురకపెట్టేవారి పక్కన పడుకుంటే ఎలా ఉంటుందో అని చూపించే వీడియో నవ్వులు పూయిస్తోంది. ఒక కుక్క గురకపెడుతూ నిద్రపోతుంటే.. పక్కనే ఉన్న పిల్లి షాక్ అయ్యి చూస్తుండడం కనిపిస్తుంది. అలా గురక పెట్టేవారి పక్కన పడుకోవడం చాలా కష్టమని పరోక్షంగా చిన్మయి చెప్పేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. చిన్మయి.. మీ భర్త రాహుల్ కి కూడా ఇదే ప్రాబ్లమ్ ఉందా..? అని కొందరు అడుగుతుంటే.. మాకు అలాగే అనిపిస్తోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story