హుజురాబాద్ ఎఫెక్ట్.. సింగరేణి కార్మికుల్లో కీలక చర్చ

by Sridhar Babu |
హుజురాబాద్ ఎఫెక్ట్.. సింగరేణి కార్మికుల్లో కీలక చర్చ
X

దిశ, గోదావరిఖని : తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం సింగరేణి బొగ్గు గనులపై పడిందా.. అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా కార్మికుల్లో చర్చ కొనసాగింది. ఎప్పటికప్పుడు కార్మికులు సైతం బొగ్గు గనులపై ఉప ఎన్నికల ఫలితాలను చూస్తూ ఉండటం ఉత్కంఠకు దారి తీసింది. అయితే హుజురాబాద్ బైపోల్ ఇప్పుడు సింగరేణి ఎన్నికలకు కార్మికుల్లో చర్చగా మారింది.

హుజురాబాద్ ఓటర్లు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు నిర్వహించే పరిస్థితులపై చర్చ నడుస్తోంది. ఓ వైపు జాతీయ కార్మిక సంఘాలు హైదరాబాద్‌లోని సెంట్రల్ లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో సింగరేణి ఎన్నికలు అనివార్యంగా మారాయి. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తోందో అన్న ఆసక్తి సింగరేణి వ్యాప్తంగా కార్మికుల్లో నెలకొంది.

Advertisement

Next Story