- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కార్మికులందరూ వ్యాక్సిన్ వేయించుకోండి : సింగరేణి జీఎం
దిశ, మణుగూరు: మణుగూరు ఏరియాలోని సింగరేణి కార్మికులందరికీ వ్యాక్సిన్ అందించేందుకు యాజమాన్యం మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆదివారం పీవీ కాలనీలోని సీఈఆర్ క్లబ్‌లో జీఎం జక్కం రమేష్ ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి కార్మికుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. యాజమాన్యం కరోనా నివారణకు ప్రత్యేక చర్యలను చేపట్టిందన్నారు. సింగరేణి కార్మికులతో పాటు కుటుంబ సభ్యులు వ్యాక్సినేషన్ ప్రక్రియను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏరియాలోని అన్ని గనుల్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించి నివారణా చర్యలను, పకడ్బంధీగా అమలు చేస్తున్నామని తెలిపారు. కార్మికులందరూ కరోనా నిబంధనలను క్రమం తప్పకుండా పాటించి మాస్కులు, శానిటైజర్‌లను వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వుకంటి ప్రభాకర్ రావు, సీపీపీ నాగభూషన్రెడ్డి, టీబీజీకేఎస్ నాయకులు సామా శ్రీనివాస రెడ్డి,కోట శ్రీనివాసరావు,అబ్దుల్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.