సింగరేణి ఉద్యోగుల జీతాల్లోనూ కోత

by Shyam |   ( Updated:2020-04-01 08:52:44.0  )
సింగరేణి ఉద్యోగుల జీతాల్లోనూ కోత
X

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ల ఉద్యోగుల వేతనాల్లో కోత పడుతోంది. తాజాగా సింగరేణి సంస్థ తన ఉద్యోగుల మార్చి నెల వేతనాల్లో కోత పెడుతూ బుధవారం ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ వల్ల తగినంత రాబడులు లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. బోర్డు లెవెల్, బిలో బోర్డు లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల స్థూల వేతనాల్లో 60 శాతం, మిగతా అందరు ఉద్యోగుల స్థూల వేతనాల్లో 50 శాతం కోత పెట్టనున్నట్టు వెల్లడించింది. మార్చి 30న ప్రభుత్వం ఇచ్చిన జీవో 27 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. కోత పెట్టిన వేతనాన్ని ప్రభుత్వమిచ్చే తదుపరి ఉత్తర్వుల ప్రకారం తర్వాత చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఈ నెలతో రిటైర్ అయ్యే ఉద్యోగులకు మాత్రం వేతనాల కోత ఉండదని పేర్కొంది.

Tags: singareni, telangana, cut in salaries,

Advertisement

Next Story

Most Viewed