- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాక్సమ్ ఇంటర్నేషనల్ ఫైనల్‌లో సిమ్రన్‌జిత్ కౌర్
దిశ, స్పోర్ట్స్ : స్పెయిన్‌లో జరుగుతున్న 35వ బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫైనల్‌కు భారత బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ 60 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. పోర్టోరికాకు చెందిన కిరియా తాపియాతో జరిగిన సెమీస్‌లో సిమ్రన్ జిత్ అద్భుతమైన పంచులతో ప్రత్యర్థిని ఓడించి ఫైనల్ చేరుకున్నది.
57 కేజీల విభాగంలో జాస్మిన్ కూడా ఫైనల్‌కు చేరుకున్నది. అయితే 6 సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ 51 కేజీల విభాగంలో ఫైనల్ చేరుకోలేక పోయింది. అమెరికాకు చెందిన విర్జినియా ఫుష్‌తో జరిగిన మ్యాచ్‌లో మేరీ కోమ్ ఓటమిపాలయ్యింది. దీంతో మేరీకోమ్ కేవలం కాంస్య పతకంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది.
పురుషుల విభాగంలో సతీష్ కుమార్ (91+ కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇండియా నుంచి తొలి హెవీ వెయిట్ బాక్సర్‌గా రికార్డుకెక్కిన సతీష్ టోక్యో ఒలంపిక్స్ బెర్తు కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ టోర్నీలో రాణిస్తే అతడి అవకాశాలు మెరుగవుతాయి.