వారం రోజుల నుంచి వెతికినా దొరకలేదు కానీ,..

by Shyam |
వారం రోజుల నుంచి వెతికినా దొరకలేదు కానీ,..
X

దిశ, నిజామాబాద్ రూరల్: ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక ను సీజ్ చేసినట్లు తహశీల్దార్ ఎం.రమేష్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుండి గ్రామంలో ఉన్న వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ, ఎవరికీ కనబడకుండా గ్రామంలో డంపింగ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రోజువారీగా పెట్రోలింగ్ చేసినా ఇసుక తరలించే దొంగలు దొరకక పోగా ఆదివారం ఉదయం చేసిన స్పెషల్ డ్రైవ్ లో గ్రామంలో సుమారుగా ఎనిమిది నుంచి పది అక్రమంగా తరలించిన ఇసుక కుప్పలను సీజ్ చేసినట్లు తహశీల్దార్ పేర్కొన్నారు. పట్టుబడ్డ ఇసుకను గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతిలో భాగంగా డంపింగ్ యార్డ్, క్రే మెట్రోరియ, వైకుంఠ దామం నిర్మాణాలకు పట్టుబడ్డ ఇసుకను తరలించి వాటి నిర్మాణ పనులకు ఉపయోగించనున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed