- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హార్డ్‌డిస్క్ బుక్ చేస్తే.. ఆ వస్తువులు వచ్చాయ్..!
దిశ ప్రతినిధి, మెదక్ : ఒకప్పుడు ఏదైనా వస్తువు కావాలంటే నేరుగా షాపుకు వెళ్లి ఒక్కటికి రెండు సార్లు చెక్ చేసుకొని కొనేవాళ్లం. కానీ టెక్నాలజీ పెరిగింది. ఆర్డర్ చేస్తే చాలు ఇంటి ముందుకు వచ్చేస్తోంది. కొవిడ్ కారణంగా చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌కి ఇష్టపడుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు డ్రెస్సులు, చెప్పులు, ఇతర వస్తువులన్నీ ఆన్‌లైన్ ద్వారానే షాపింగ్ చేస్తున్నారు. కానీ అందులోనూ మోసాలు తప్పడం లేదు. ఇటీవల ఆన్‌లైన్‌లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక వస్తువు బుక్ చేస్తే మరో వస్తువు పంపించడం లాంటి వార్తలు వింటూనే ఉన్నాం. సరిగ్గా సిద్దిపేటలోనూ అదే సంఘటన జరిగింది.
హార్డ్ డిస్క్ బుక్ చేసుకుంటే..
సిద్దిపేటకు చెందిన రాజ్‌కోటి అనే వ్యక్తి అమెజాన్ యాప్ ద్వారా ఆన్లైన్ లో టూటీబీ హార్డ్ డిస్క్ బుక్ చేశాడు. దాని విలువ రూ.5 వేలు. బుక్ చేసిన నాలుగు రోజులకు హార్డ్ డిస్క్ ను ఇంటికి పంపారు. త్వరలోనే అమెజాన్ వారు హార్డ్ డిస్క్ ను పంపారని సంతోష పడ్డాడు. కానీ ఆ సంతోషం ఎంతో సమయం నిల్వలేదు. క్షణాల్లోనే మాయమైంది. ఎందుకనేగా మీ అనుమానం… అందులో వచ్చింది హార్డ్ డిస్క్ కాదు మరీ. కేవలం హార్డ్ డిస్క్ పైభాగానే ఉండి ఖాళీ బుర్రలు వచ్చాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించాడు.
ఇలాంటి సంఘటనలు గతంలోనే అనేకం జరిగాయి. ఈ సందర్భంగా ఆయన దిశలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కొవిడ్ కారణంగా బయటకు వెళ్లి షాపింగ్ చేయలేని పరిస్థితుల్లో ఆన్లైన్ లో హార్డ్ డిస్క్ ఆర్డర్ చేశాను. హార్డ్ డిస్క్ కు బదులు అమెజాన్ వారు ఖాళీ బుర్రలు పంపారంటూ వాపోయిడు. తక్షణమే అమెజాన్ వారు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. దీనిపై అమెజాన్ కంపెనీ వారు ఎలా స్పందిస్తారో చూడాలి.