మెదక్‌లో డ్రోన్ కెమెరాతో లాక్‌డౌన్ పరిశీలన

by Shyam |   ( Updated:2020-04-12 06:43:16.0  )
మెదక్‌లో డ్రోన్ కెమెరాతో లాక్‌డౌన్ పరిశీలన
X

దిశ, మెదక్: లాక్‌డౌన్ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్లో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ప్రజలు, వాహనదారులు ఏ విధంగా భౌతిక దూరం పాటిస్తున్నారని టూ టౌన్ సీఐ పరశురామ్ గౌడ్, ఐటీ సిబ్బంది పరిశీలించారు.కరోనా వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్ మరింత పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు సిద్దిపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, అంబేద్కర్ సర్కిల్, నర్సాపూర్ చౌరస్తా, విక్టరీ చౌరస్తా, ముస్తాబాద్ చౌరస్తాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. లైవ్ మానిటరింగ్ ద్వారా ఎక్కడైతే ప్రజలు అనవసరంగా, సమూహంగా ఉంటారో వారిని అదుపులోకి తీసుకొని, రోడ్డు మీద తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఏ పని లేకుండా రోడ్లపై బైకులతో తిరిగే వారిని డ్రోన్ కెమెరా సాయంతో కనిపెట్టి వాహనాలను సీజ్ చేస్తున్నామన్నారు.ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, పోలీసులకు సహకరించాలని సిద్దిపేట పోలీసులు సూచించారు.కార్యక్రమంలో ఐటీ సిబ్బంది శశికాంత్, శ్రీధర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

tags; lockdown, carona , drone cam, security chek,siddipet

Advertisement

Next Story

Most Viewed