ఈటలను కలిసిన సిద్దిపేట నేతలు.. రాజకీయ పరిస్థితులపై చర్చ

by Shyam |   ( Updated:2021-11-30 01:45:40.0  )
MLA Etela Rajender
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట బీజేపీ నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారాన్ని ఎండగట్టి విజయఢంకా మోగించిన ఈటలను శామీర్‌పేటలోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఈటలతో సిద్దిపేట రూరల్ మండల ఇన్‌చార్జి తోడుపునూరి వెంకటేశం సుమారు అరగంట పాటు చర్చించారు. సిద్దిపేట రాజకీయ పరిస్థితులు, సమస్యలపై ఈటలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వికలాంగుల సెల్ కన్వీనర్ బొల్లవేణి యాదగిరి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story