- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘సిమెంట్ దిగుమతులపై సుంకం పెంచాలి’.. పరిశ్రమల సంఘం!
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే బడ్జెట్‌లో భారత్‌కు దిగుమతి అయ్యే సిమెంట్‌పై అధిక సుంకం విధించాలని దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం(సిక్మా) ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే సిమెంట్‌పై ఇతర దేశాలు అత్యధికంగా యాంటి డంపింగ్ సుంకాలను విధిస్తున్నారని, కానీ భారత్‌కు దిగుమతి అయ్యే వాటికి ఎలాంటి సుంకం ఉండట్లేదని సిక్మా ప్రతినిధులు ఆర్థికమంత్రికి వివరించారు.
‘దక్షిణ భారత్‌లో పెద్ద సున్నపురాయి నిక్షేపాలు, అదనపు సిమెంట్ సామర్థ్యం ఉంది. కాబట్టి సిమెంట్‌తో పాటు క్లింకర్ దిగుమతులపై అధిక సుంకాన్ని విధించాలని’ సిక్మా అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ అన్నారు. దేశం మొత్తం సిమెంట్ సామర్థ్యంలో 40 శాతం ఇక్కడి నుంచే అందుతోందని, రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ కొరత ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు దిగుమతులపై తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిని అభ్యర్థించారు.