దిగుమతుల రద్దీ తగ్గించాలి: సియామ్

by Harish |
దిగుమతుల రద్దీ తగ్గించాలి: సియామ్
X

దిశ, సెంట్రల్ డెస్క్: పోర్టులలో దిగుమతుల రద్దీని తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్(ఎస్ఐఏఎం) ప్రభుత్వాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఓడరేవుల్లో రద్దీ మరో వారం పాటు కొనసాగితే ఆటో తయారీదారులకు ఇబ్బందులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దిగుమతుల ఆలస్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. చైనా దిగుమతులను అడ్డుకునే క్రమంలో దేశవ్యాప్తంగా అనధికార ఆదేశాలను అనుసరించి వారం రోజులుగా సరుకులను సముద్రంలోనే నిలిపేశారు. చైనా సరుకులకు వంద శాతం క్లియరెన్స్ కోసం ఈ నిలిపివేత కొనసాగుతోందని అధికారులు చెప్పారు. అయితే, కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో దిగుమతి క్లియరెన్స్ వల్ల నెలరోజుల జాప్యం ఏర్పడిందని, మళ్లీ ఇలాంటి ఇబ్బందులతో ఓడరేవుల్లో రద్దీ తీవ్రతరమైతే వాహన తయారీదారులకు ఇక్కట్లు తప్పవని సియామ్ ప్రభుత్వానికి వివరించింది.

Advertisement

Next Story