మానవత్వం చాటుకున్న ఎస్సై

by Sridhar Babu |
SI-12
X

దిశ, బొమ్మరాసిపేట్: ఓ వృద్ధురాలిని కాపాడి మానవత్వం చాటుకున్నారు బొమ్మరాసిపేట్ ఎస్సై. వివరాల్లోకి వెళితే.. బొమ్మరాసిపేట్ భూలక్ష్మి చౌరస్తాలో ఓ వృద్ధురాలు ఫిట్స్ వచ్చి తలకు గాయాలతో పడిపోయి ఉన్నది. ఇది గమనించిన స్థానిక ఎస్సై వెంకటనారాయణ వెంటనే అక్కడికి చేరుకుని స్థానిక యువకుల సహాయంతో తన కారులో ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దీంతో స్థానికులు, ఉన్నతాధికారులు ఆయన ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story