- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ నేరల పట్ల అప్రమత్తంగా ఉండాలి : వేంసూర్ ఎస్సై
దిశ, వేంసూర్: సమాజంలో రోజు రోజుకి మత్తు పదార్ధాలు, గంజాయి, పేకాట లాంటి నేరాలు పెచ్చు మీరుతున్నాయని ఎస్ఐ విజయ్ కుమార్ అన్నారు. ఇవి చట్టరీత్యా నేరమని వీటి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే నేరుగా వేంసూర్ పోలీస్ స్టేషన్ 9440904625 నెంబర్ కు ఫోన్ చేసి తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఆచూకీ తెలిపిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచటంతో పాటు తగిన పారితోషికం కూడా అందిస్తామని అన్నారు. అలాగే ఇంటర్నెట్ లో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయని మొబైల్ ఫోన్ లలో వచ్చే యాప్ లను, మెసేజ్ లను ఓపెన్ చేయొద్దని హితవుపలికారు.
అపరచితుల ఫోన్ కాల్ లు లిఫ్ట్ చేసి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలు చెప్పవద్దని సూచించారు. ఎవరైనా తెలియక సైబర్ నేరగాళ్ల చేతుల్లో డబ్బులు పోగొట్టుకుంటే ఇరవై నాలుగు గంటల్లో పూర్తి వివరాలు సమీప బ్యాంక్ కు అలాగే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే 155260, 100 లేదా112నెంబర్లు కు ఫోన్ చేసి మీ పేరు, బ్యాంక్ అకౌంట్, నెంబర్, వ్యాలెట్ పేరు లాంటివి స్క్రీన్ షాట్ తో సహా వివరాలు అందించాలని తెలిపారు. ప్రజలంతా ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరారు.