శభాష్.. మానసిక వికలాంగురాలి పట్ల మానవత్వం చాటిన ఎస్సై అనిత

by Shyam |   ( Updated:2021-08-26 04:45:46.0  )
శభాష్.. మానసిక వికలాంగురాలి పట్ల మానవత్వం చాటిన ఎస్సై అనిత
X

దిశ, పరకాల: మానసిక స్థితి సరిగా లేని ఓ వృద్ధురాలు ఎక్కడ నుండి వచ్చిందో కానీ గత నాలుగు రోజులుగా పరకాల పట్టణంలో తిరుగాడుతోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం శ్రీ సాయి ఫిల్లింగ్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆ వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక రోజంతా ఎటూ కదలలేని స్థితిలో పడి ఉన్న ఆ మహిళను స్థానికులు గమనించి గురువారం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న ప్రొహిబిషన్ ఎస్ఐ అనిత హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అచేతనంగా పడి ఉన్న వృద్ధురాలికి బట్టలు వేయించి భోజనం నీళ్ళు సమకూర్చారు. అనంతరం 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎస్సై అనిత స్వయంగా వృద్ధురాలికి సేవలు అందించడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story