ఇన్‌స్ట్రాగ్రామ్‌లో నగ్న ఫోటోలు.. శుభం యాదవ్ అరెస్ట్

by Anukaran |   ( Updated:2020-07-08 08:31:32.0  )
ఇన్‌స్ట్రాగ్రామ్‌లో నగ్న ఫోటోలు.. శుభం యాదవ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యువతుల నగ్న ఫోటోలు పోస్టు చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన మిత్రుడి సోదరి ఫోటోలను ఇన్‌స్ట్రా గ్రామ్‌లో పోస్టు చేసిన యువకుడు శుభం యాదవ్‌ను బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ అకౌంట్‌తో అమ్మాయిల నగ్న ఫోటోలను పోస్టు చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్న శుభం యాదవ్… ఇటీవల ఓ యువతిని నగ్న ఫోటోల కోసం వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story