- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కోసం వంట చేసిన శ్రుతి
దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల తన తండ్రి కమల్ హాసన్, రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజరికాతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన సంగతి విదితమే. ఆ ఫొటో చూసి శాంతనుతో శ్రుతి ప్రేమలో పడిందని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా శ్రుతి శాంతను కోసం స్పెషల్‌గా వంట కూడా చేసింది. ఈ వీడియోను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది శ్రుతి..వీడియోలో జపాన్ స్పెషల్ నూడుల్ సూప్ ‘రమెన్(Ramen)’ మేకింగ్ కనపడ్తోంది. శ్రుతి నటించిన ఆంథాలజీ ‘పిట్ట కథలు’ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవలే రిలీజైంది. ప్రస్తుతం ఈ భామ విజయ్ సేతుపతి హీరోగా వస్తోన్న ‘లాభం’ చిత్రంతో పాటు ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ ‘సలార్’లోనూ నటిస్తోంది. కాగా, శాంతనుతో రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు శాంతను కానీ శ్రుతి కానీ ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయలేదు. విజయ్ సేతుపతితో నటిస్తోన్న ‘లాభం’ మూవీ నుంచి ‘యాజా యాజా’ లిరికల్ వీడియో విడుదలై ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ సాంగ్‌కు యుగభారతి లిరిక్స్ అందించగా, డి.ఇమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, ఈ సాంగ్ శ్రుతియే పాడటం విశేషం.