- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడ్చల్ నుంచి కదిలిన 'శ్రామిక్ ఎక్స్‌ప్రెస్'
బీహార్‌కు వెళ్లిన 1250 మంది వలస కార్మికులు
దిశ, న్యూస్ బ్యూరో : వలస కార్మికులను తరలించేందుకు ప్రతీ రోజు తెలంగాణ నుంచి 40 రైళ్లు నడుస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే తొలి ‘శ్రామిక్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఘట్‌కేసర్ నుంచి బీహార్‌కు బయలుదేరింది. బీహార్‌లోని ఖాగారియాకు 1,250 మంది వలస కార్మికులతో తెల్లవారుజామున మూడు గంటలకు ఈ రైలు బయలుదేరింది. కార్మికులందరికీ ఉదయం టిఫిన్, వాటర్ బాటిళ్లను తెలంగాణ ప్రభుత్వం అందజేయగా.. రైల్లో ప్రయాణించేవారందరికీ వైద్య సిబ్బంది స్టేషన్ ఆవరణలో థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించారు. వీరందరినీ పని స్థలాల నుంచి ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ వరకు బస్సుల్లో ‘సోషల్ డిస్టెన్స్’ నిబంధనను అమలుచేస్తూ పోలీసులు తీసుకొచ్చారు. కాగా, స్టేషన్ నుంచి బయలుదేరుతున్న కార్మికులతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్ల, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వేర్వేరుగా కొద్దిమంది కార్మికులతో ముచ్చటించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. అనంతరం వారికి వీడ్కోలు పలికారు.
తొలి రైలు బయలుదేరిందన్న విషయం తెలుసుకున్న నగర శివారు ప్రాంతాల్లోని వలస కార్మికులు స్థానిక పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ఇంతకాలం ప్రభుత్వానికి చెందిన ఏ అధికారికి తమ గోడు వెళ్లబోసుకోవాలో వారికి స్పష్టత లేక పస్తులతోనే సైట్ క్యాంపుల్లో ఉండిపోయారు. కానీ కేంద్ర ప్రభుత్వం సొంతూళ్లకు వెళ్లేందుకు అవకాశం కల్పించడంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వలస కార్మికులు రోడ్డెక్కారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసి, స్థానిక పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకోవాలని కార్మికులకు సూచించింది. దీంతో కార్మికులు ఇప్పుడు పోలీసు స్టేషన్లను ఆశ్రయించి సొంతూళ్లకు వెళ్లేందుకు పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అక్కడ పోలీసులు.. వలస కార్మికుల నుంచి అన్ని వివరాలను తీసుకుని వారికి అవసరమైన పాస్ జారీ చేసి నోడల్ అధికారికి పంపుతున్నారు. ఇలా తయారైన జాబితాను రైల్వే అధికారులు అందుకుని ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడపడంపై నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ వివరాలేవీ లేకుండా ఏ సమయానికి ఏ రైలు కదులుతుందో దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కూడా స్పష్టత ఉండటం లేదు. గోల్కొండ, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 300 మంది కార్మికులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సుల ద్వారా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌కు తరలించింది.
Tags: Telangana, Migrant Labour, Railway, Medchal, Rachakonda collector