- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రకాశం జిల్లా కలెక్టర్‌కి షోకాజ్ నోటీసులు
దిశ ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్‌కు విద్యుత్ నియంత్రణ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీని పూర్తి వివరాల్లోకి వెళ్తే… 2017లో పొదిలి–పర్చూరు మధ్య ఏపీ ట్రాన్స్ కో 220 కేవీ విద్యుత్ లైన్ వేసింది. ఈ లైన్ సుబాబుల్ సాగు చేస్తున్న వలేటి వెంకట శేషయ్య భూమి మీదుగా వెళ్లింది. ఈ లైన్ కారణంగా 80 సెంట్ల భూమి దెబ్బతింటుందని, పరిహారం చెల్లించాలని ఆయన విద్యుత్ ఉన్నతాధికారులను కోరాడు. పరిహారమిచ్చేందుకు వాళ్లు నిరాకరించారు. వారి చుట్టూ తిరిగి విసిగిపోయిన వెంకట శేషయ్య పరిహారం కోసం జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గత మార్చి 5న ఆ రైతు ఏపీఈఆర్‌సీని ఆశ్రయించాడు. దీంతో పరిహారం ఎందుకు చెల్లించలేదో చెప్పాలంటూ కమిషన్ వివరణ కోరింది. దీనికి కూడా కలెక్టర్ స్పందించలేదు. దీంతో విద్యుత్ నియంత్రణ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని చెబుతూ కలెక్టర్‌కు షోకాజ్ నోటీసులు పంపింది. రెండు వారాల్లో సరైన వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.