- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత.. జూడాలపై ఒత్తిడి
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న తొమ్మిది పాత మెడికల్ కాలేజీల్లోనూ స్టాఫ్ కొరత వేధిస్తున్నది. గాంధీ, ఉస్మానియా, కాకతీయ వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ , సిద్ధిపేట్, నల్గొండ, సూర్యాపేట్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో వీటికి అనుసంధానంగా ఉన్న టీచింగ్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయి. టీవీవీవీ, డీఎంఈ పరిధిలో సుమారు 1,185 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తున్నట్లు చెబుతున్న సర్కార్, పాత కాలేజీల్లో స్టాఫ్ కొరతను అధిగమించే చర్యలు తీసుకోవడం లేదు.
ఈ క్రమంలో టీచింగ్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఆలస్యమవడమే కాకుండా, జూనియర్ డాక్టర్లపై ఒత్తిడి పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీని నియమించాలని జూడాలు సర్కార్‌ను కోరారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుకు వినతి పత్రం అందించారు.
వర్క్ ప్రెజర్ పెరిగింది..డా. కార్తీక్గాంధీ, జూనియర్ డాక్టర్
ప్రభుత్వాసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక ఇబ్బందులు వస్తున్నాయి. జూడాలకు సమస్యలు వస్తున్నాయి. స్టాఫ్ కొరతతో సరైన సమయంలో రోగులకు వైద్యం అందించలేకపోతున్నాం. దీంతో క్యాలెండర్ ఇయర్ ప్రకటించి రెగ్యులర్ విధానంలో వెంటనే పోస్టులు భర్తీ చేయాలి. దీంతో పాటు ఉస్మానియాలో కొత్త బిల్డింగ్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. నిమ్స్ తరహాలో స్టైయిఫండ్ పెంచాలి.