- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, క్రైమ్ బ్యూరో: కరోనా కట్టడిలో భాగంగా నైట్ కర్ఫ్యూ మొదటి రోజు పలు చోట్ల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకి మరింత వేగంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రజల రద్దీని తగ్గించేందుకు కర్ఫ్యూ విధించారు అయితే మొదటి రోజే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడం లాంటి సంఘటనలతో పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుత రంజాన్ సమయం కావడంతో రాత్రి 11 గంటలు దాకా దుకాణాలు తెరిచి ఉన్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదే క్రమంలో పౌరుల పట్ల దురుసుగా ప్రవర్తించరాదనే పోలీస్ బాస్ ఆదేశాలు ఉండటంతో.. స్థానిక పోలీసు అధికారులు చేసేదేమీ లేక పలువురిపై కర్ఫ్యూ ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు.
మైకుల ద్వారా అవగాహన
రాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల వ్యవహారించాల్సిన విధి విధానాలపై మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు. కరోనా మొదటి వేవ్ లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసుల ప్రవర్తనపై అనేక విమర్శలు రావడంతో.. కర్ఫ్యూ సందర్భంగా పౌరుల పట్ల దరుసుగా ప్రవర్తించరాదని డీజీపీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంగళవారం రాత్రి నుంచి మొదలైన కర్ఫ్యూ సమయంలో వాహనదారులు, పౌరుల పట్ల పోలీసులు సావధానంగా వ్యవహారిచేందుకే ప్రయత్నించారు. ఏది ఏమైనా.. కర్ఫ్యూ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత కూడా పోలీసులదే కావడంతో రాత్రి 9 గంటల తర్వాత తెరిచి ఉంచిన దుకాణాదారులు, అక్కడికొచ్చే వినియోగదారులపై పోలీసులు కర్ఫ్యూ నిబంధనలు ఉన్నాయ్.. రోడ్లను ఖాళీ చేసి ఇండ్లకు వెళ్లిపోవాలని మైకుల ద్వారా ప్రచారం చేశారు.
కర్ఫ్యూ అమలులో భాగంగా రాత్రి 8 గంటల సమయానికే ప్రభుత్వం కేటాయించిన నిత్యావసర విభాగాలు మినహా మిగతా అన్ని రకాల కార్యాలయాలు, వ్యాపారాలు, సంస్థలు బంద్ చేయాల్సి ఉంది. ప్రతిరోజూ రహదారుల నిండుగా కన్పించే వాహనదారులతో కళకళలాడే నగరం ఒక్కసారిగా మంగళవారం రాత్రి బోసిపోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అబిడ్స్, లక్డీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, మాధాపూర్ తదితర ప్రాంతాలలో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రంజాన్ నేపథ్యంలో చార్మినార్, మక్కామసీదు, మదీనా సెంటర్, పత్తర్ గట్టి, మొఘల్ పురా, శాలిబండ, లాడ్ బజార్ తదితర అత్యధిక వ్యాపార సముదాయాలు ఉండే ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ నిబంధనలకు విరుద్దంగా దుకాణాలు తెరిచే ఉండటం గమనార్హం. దీంతో డిజిస్టార్ మేనేజ్మెంట్, అపెడమిక్ డిసీస్ యాక్ట్ -2005 ప్రకారం పలువురి దుకాణాదారులపై కేసులు నమోదు చేసినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు.